హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో యువనటిని వెంబడించిన అగంతుకుడు.. కటకటాల వెనక్కి పంపిన పోలీసులు!

  • నడక కోసం పార్క్‌కు వచ్చిన యువనటి 
  • రాత్రి 7 గంటల సమయంలో ఘటన
  • పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించిన పార్క్ సిబ్బంది
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో యువనటిని వెంబడించిన అగంతుకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వారి కథనం ప్రకారం.. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో నివసించే యువ నటి గత రాత్రి కేబీఆర్ పార్క్‌కు నడక కోసం వచ్చారు. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె పార్క్‌లో నడుస్తున్న సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. 

గమనించిన ఆమె ఓ చోట ఆగగా, అతడు కూడా ఆగిపోయాడు. ఆ తర్వాత ఆమె నడక కొనసాగిస్తే అతడు కూడా అలాగే చేశాడు. ఇలా ఐదారుసార్లు జరిగింది. దీంతో అనుమానించిన ఆమె తనతోపాటు నడుస్తున్న ఇతరులకు ఆ విషయాన్ని చెప్పింది. వారు పార్క్ సిబ్బందికి చెప్పడంతో వారొచ్చి అతడిని పట్టుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శేఖర్‌గా గుర్తించారు. కాగా, ఇదే నటిని గతంలో ఇదే పార్క్‌లో ఓ ఆగంతుకుడు బెదిరించి లైంగిక దాడికి యత్నించాడు.

Banjara Hills
KBR Park
Tollywood
Young Heroine

More Telugu News